1 May, 2026 | 11:31 PM

మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల పరిరక్షణకై పోరాటాలు ఉదృతం చేయాలి

01-05-2026 10:30 PM

సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు డిమాండ్

ములకలపల్లి,(విజయక్రాంతి): చికాగో నగర అమరవీరుల ఉద్యమ స్ఫూర్తితో కార్మిక ఉద్యమాలను ఉధృతం చేయాలని సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు పిలుపునిచ్చారు. 140 వ మేడే సందర్భంగా శుక్రవారం మండల కేంద్రము లోని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్,ఆశా వర్కర్ యూనియన్,హమాలి వర్కర్స్ యూనియన్,నర్సరీ వర్కర్స్ యూనియన్, ఆటో యూనియన్, వివిధ రంగాల యూనియన్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సిఐటియు జెండాలు ఎగురవేయడం జరిగింది. అనంతరం మండల కేంద్రము లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.12 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని కార్మికులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.