calender_icon.png 15 August, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో జాతీయ జెండాకు అవమానం

15-08-2025 09:29:42 PM

ఏఎంసీ ఏరియాలో రాత్రి వరకు మువ్వన్నెల జెండా రెపరెపలు

బెల్లంపల్లి,(విజయక్రాంతి): 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నప్పటికీ జాతీయ జెండాకు అవమానం జరిగింది. పట్టణంలోని ఏఎంసి ఏరియాలో ఆవిష్కరించిన జాతీయ జెండాను రాత్రి 7:30 గంటల వరకు అవనతం చేయకుండా  వదిలేశారు. ఉదయం ఆవిష్కరించిన జాతీయ జెండాను సాయంత్రం 6 గంటలలోపు అవనతం చేయడం గౌరవంగా భావిస్తారు. కానీ ఉదయం ఎగరేసిన జాతీయ జెండా రాత్రి వరకు రెపరెపలాడుతూ తన అత్యున్నత గౌరవాన్ని కోల్పోయింది.రాత్రి 8 గంటల తర్వాత జాతీయ జెండాను అవనతం చేశారు.