calender_icon.png 15 August, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ డ్రైవర్ల సంఘం కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

15-08-2025 09:25:07 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ సుబేదారిలోని తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉమ్మడి జిల్లా కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండి సాబీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ ప్రకాష్, కోశాధికారి యు కృష్ణమూర్తి, నాయకులు ఎండి అఫ్జల్ మియా, కంజర్ల సతీష్, కోమటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.