అంతర్రాష్ట్ర బస్సు సర్వీస్ ప్రారంభం
17-06-2026 04:30 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ డిపో ద్వారా అంతర్రాష్ట్ర పల్లె వెలుగు బస్సులు బుధవారం ప్రారంభించినట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. నిర్మల్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు ఉదయం 7:30 నిర్మల్ నుంచి బయలుదేరి కల్లూరు, కుంటాల , చాత, పార్టీ బి. మర్ల గుండ, మహారాష్ట్ర, ఇస్లాపూర్, హిమాయత్ నగర్ ఉమర్ వరకు వెళ్తుందన్నారు. తిరిగి అక్కడ నుండి 11 గంటల 40 నిమిషాలకు బయలుదేరి అదే మార్గంలో నిర్మల్ కు చేరుకుంటుందని డిఎం వివరించారు. మహారాష్ట్ర కుబీర్ కుంటాల ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ బస్సు సర్వీసు ఏర్పాటు చేశామని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు డిఎం సూచించారు. ప్రయాణికుల రద్దీని బట్టి అవసరమైతే మరిన్ని బస్సులు నడుపుతామని తెలిపారు.






