స్వేరోస్ గ్రామ కమిటీ ఎన్నిక
మోతె,(విజయక్రాంతి): మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో స్వేరోస్ గ్రామ నూతన కమిటీని స్వేరోస్ నెట్వర్క్ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లపల్లి శివకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడుగా నవిలే నరేష్, ప్రధాన కార్యదర్శిగా నవిలే నరేష్,ఉపాధ్యక్షులుగా పవన్ కళ్యాణ్, కోశాధికారిగా సైదులు, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా మధు, విగ్నేష్, జాయింట్ సెక్రటరీగా రవి, అడ్వైజర్ గా గణేష్, కమిటీ సభ్యులుగా నరేష్, వీరబాబు, వినయ్, గణేష్, వినయ్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లపల్లి శివకృష్ణ మాట్లాడుతూ. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచనలో నుంచి పుట్టిన స్వేరోస్ నెట్వర్క్ అక్షరం, ఆర్థికం,ఆరోగ్యం అనే నినాదంతో అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. స్వేరోస్ చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య ఆదేశానుసారం మేరకు కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ గ్రామాన స్వేరోస్ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఎన్నికైన నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వేరో సిద్ధాంతాలను పాటిస్తూ నెట్వర్క్ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. స్వేరోస్ సిద్ధాంతాలో అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో స్వేరోస్ మోతె మండల నాయకులు మేకల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.






