7 August, 2026 | 9:47 PM

సహచరి గ్రూపు సభ్యులతో అవగాహన సమావేశం

07-08-2026 09:14 PM

ప్రతి సభ్యుడు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్ గా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

సీఐ జలంధర్ రెడ్డి

మేడిపల్లి,(విజయక్రాంతి): సమాజ భాగస్వామ్య పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా నేడు మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ డి. జలేందర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సహచరి గ్రూపు సభ్యులతో మేడిపల్లిలోని పాత పీఎంసీ కార్యాలయంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళల భద్రత, రోడ్డు భద్రత, నేరాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన, కమ్యూనిటీ పోలీసింగ్ ప్రాముఖ్యత, అత్యవసర పరిస్థితుల్లో అనుమాన్సపద్ధ వ్యక్తుల కధలీకల గురించి  పోలీసులకు వెంటనే సమాచారం అందించడం వంటి అంశాలపై సభ్యులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.

ముఖ్యంగా ఆన్‌లైన్ మోసాలు, ఫోన్ కాల్స్, ఓటిపిలు, నకిలీ లింకులు, డిజిటల్ లావాదేవీలలో మరియు మహిళల పై జరిగే నేరాలు,  డ్రగ్స్ గురుంచి ,పబ్లిక్ బూజింగ్ మరియు దొంగతనాలు అరికట్టడం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అదేవిధంగా, ప్రజలు మరియు పోలీసుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంలో సహచరి గ్రూపు సభ్యుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.

తమ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలను వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, ప్రజల్లో భద్రతా అవగాహన పెంపొందించేందుకు చురుకుగా పనిచేయాలని, ప్రతి సభ్యుడు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్ గా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న సహచరి గ్రూపు సభ్యులు మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, నేర నియంత్రణ కార్యక్రమాల్లో పోలీసులకు పూర్తి సహకారం అందిస్తూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.