7 August, 2026 | 9:45 PM

బడి ఈడు పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

07-08-2026 09:11 PM

బాలల హక్కుల సభ్యురాలు గోగుల సరిత

జవహర్ నగర్,(విజయక్రాంతి): బడి ఈడు పిల్లలను బావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని బాలల హక్కుల సభ్యురాలు గోగుల సరిత పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ గబ్బిలాల పేటలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు గోగుల సరిత శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా బస్తీలోని స్థానిక సమస్యలతో పాటు పిల్లల విద్యా హక్కులు సంక్షేమానికి సంబంధించిన పలు విషయాలపై సమీక్ష జరిపారు.

పిల్లల ఆధార్ బర్త్ సర్టిఫికెట్ల మంజూరుకు హామీ ఇచ్చి అనంతరం మాట్లాడుతూ... గబ్బిలాల పేటలో బడి ఈడు పిల్లలందరూ బల్లోకి వచ్చే విధంగా పిల్లల తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు.  పాఠశాలలో ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ లేని పిల్లల డేటాను తక్షణమే సేకరించి అందించాలని ఆదేశించారు. అనంతరం అంగన్వాడి సెంటర్ ను సందర్శించి మూడు నుండి ఆరు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని సూచించారు. అవసరమైతే పిల్లలను తీసుకెళ్లడానికి ఆయమ్మను పంపించేలా సిడిపిఓ లతో మాట్లాడతానని తెలిపారు.

సొంత భవనం కేటాయింపు కోసం కృషి చేస్తానని ప్రస్తుత అద్దభవనంలో తాత్కాలికంగా నడుస్తున్న పాఠశాల సమస్యలను స్థానికులు సరిత దృష్టికి తీసుకురాగా సాధ్యమైనంత త్వరగా భూమిని కేటాయించి నూతన పాఠశాల భవనాన్ని నిర్మించి తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల సాధన కమిటీ కన్వీనర్ సూర వెంకటయ్య, కమిటీ సభ్యులు ఆవుల దుర్గేష్, అల్లూరి సావిత్రి, కురుమయ్య, నరసింహ, రాణి, స్వప్న, పద్మ, యూత్ మెంబర్లు కృష్ణ ప్రసాద్ సాయి విష్ణు తదితరులు పాల్గొన్నారు.