7 March, 2026 | 1:20 PM

డేవిడ్‌రెడ్డితో అంతర్జాతీయ బ్యూటీ!

07-03-2026 12:00 AM

స్టార్ హీరో మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా ‘డేవిడ్ రెడ్డి’. ఈ చిత్రాన్ని వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్లపై నల్లగంగుల వెంకట్‌రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. హనుమరెడ్డి యక్కంటి ద ర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆర్ పార్తీబన్, కాం చన కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను బ్రిటీష్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌తో ఇంటెన్స్ యా క్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.

1897 నుంచి 1920 మధ్య బ్రిటీష్ పాలనా కాలాన్ని నేపథ్యంగా రూపుదిద్దుకుంటోందీ సినిమా. బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురునిలిచిన యోధుడు డేవిడ్‌రెడ్డిగా ఈ చిత్రంలో మంచు మనోజ్ కొత్త అవతార్‌లో కనిపించనున్నారు. ఇక ఇందులో ఆయనకు జోడీగా అంతర్జాతీయ నటి మరియా ర్యాబోషాప్కా నటించనుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మనోజ్, మరియా మధ్య మంచి కెమిస్ట్రీ ఉన్న సన్నివేశాలు ఆకట్టుకుంటాయని టీమ్ పేర్కొంటోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్; డీవోపీ: ఆచార్య వేణు; కాస్ట్యూమ్స్: హైందవి సుధ; యాక్షన్: సుప్రీమ్ సుందర్; ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి; ఆర్ట్: రవి జక్కుల.