ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్‌కు చిరు సన్మానం
ములుగు,(విజయక్రాంతి): ములుగు జిల్లా మీసేవ ఆపరేటర్ల సమావేశం శనివారం స్థానిక సమావేశ మందిరంలో జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సామాజి దేవేందర్ ని మీసేవ ఆపరేటర్లు శాలువాతో చిరు సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మీసేవ ఆపరేటర్లు మాట్లాడుతూ... "మా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, మా సంక్షేమం కోసం ఎల్లవేళలా కష్టపడుతున్న మా ఈడీఎం కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ముఖ్యంగా మీసేవ వి ఎల్ ఈ లకు కమిషన్ పెంపు విషయంలో కీలక పాత్ర పోషించి మాకు అండగా నిలిచారు" అని హర్షం వ్యక్తం చేశారు.
సమావేశంలో మీసేవ కేంద్రాల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, సర్వర్ ఇబ్బందులు, సేవల్లో జాప్యం తదితర అంశాలపై చర్చించారు. ఆపరేటర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ చూపిన చొరవ అభినందనీయమని ఆపరేటర్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వేగంగా అందించడంలో మీసేవ ఆపరేటర్ల పాత్ర చాలా కీలకమని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని అధికారులు ఈ డిస్టిక్ మేనేజర్ దేవేందర్ డిఎం విజయ్ రాకేష్ లు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం డీఎంలు పోలోజు విజయ్, రాకేష్ లను మీసేవ నిర్వాహకులు శాల్వలతో ఘనంగా సన్మానించారు.






