2 August, 2026 | 10:46 PM

జిగ్లీ పెట్ కేర్ లో అంతర్జాతీయ హ్యాపీ పెట్స్ డే

02-08-2026 09:52 PM

సికింద్రాబాద్, ఆగస్టు 02, 2026: 

భారతదేశపు మొట్టమొదటి ఓమ్నిఛానల్ పెట్ కేర్ బ్రాండ్ అయిన జిగ్లీ పెట్ కేర్, తమ సికింద్రాబాద్ జిగ్లీ పెట్ కేర్ సెంటర్‌లో అంతర్జాతీయ హ్యాపీ పెట్స్ డే మూడవ ఎడిషన్ ను ఘనంగా జరుపుకుంది.

గత రెండు ఎడిషన్ ల విజయం స్ఫూర్తితో జరిగిన ఈ వార్షిక వేడుక, స్నేహితుల దినోత్సవంతో పాటుగా జరగటంతో పాటుగా పెంపుడు జంతువుల యజమానులు, వారి ఫర్ ఫ్రెండ్స్ మధ్య ఉన్న ప్రత్యేక బంధాన్ని వేడుక జరుపుకోవడానికి, అలాగే చురుకైన రీతిలో పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడానికి వారిని ఒకచోట చేర్చింది. ఈ కార్యక్రమంలో, నాణ్యమైన పశువైద్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావటం,  సమీకృతంగా మరియు సమాజ ఆధారితంగా చేయటం ద్వారా భారతదేశ పెంపుడు జంతువుల సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను జిగ్లీ పెట్ కేర్ పునరుద్ఘాటించింది.

దేశవ్యాప్తంగా 15కు పైగా నగరాల్లోని 35 కేంద్రాలలో  రోజంతా నిర్వహించిన  వేడుకలో 2,500కు పైగా పెంపుడు జంతువులు, 3,500కు పైగా పెంపుడు జంతువుల యజమానులు పాల్గొన్నారు. “కలిసి ఉంటే,  నిస్సందేహంగా జీవితం మరింత బాగుంటుంది” అనే ఇతివృత్తంతో నిర్వహించిన అంతర్జాతీయ హ్యాపీ పెట్స్ డే 2026, పెంపుడు జంతువులు , వాటి యజమానుల కోసం అనేక ఆసక్తికరమైన అనుభవాలను అందించింది.

అదే సమయంలో, ఉచిత ఆరోగ్య పరీక్షలు , వెల్నెస్ కన్సల్టేషన్లతో చురుకైన ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించింది. ఈ కార్యక్రమంలో పెట్ ఫస్ట్ ఎయిడ్ కిట్‌లను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, సికింద్రాబాద్ జిగ్లీ పెట్ కేర్ సెంటర్‌లోని పెంపుడు జంతువుల యజమానులు, పశువైద్యుని ఆధ్వర్యంలో జరిగిన పెట్ ఫస్ట్ ఎయిడ్ వర్క్‌షాప్‌లో కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జిగ్లీ పెట్ కేర్ సీఈఓ సౌరభ్ జైన్ మాట్లాడుతూ, “పెంపుడు జంతువులు , వాటి కుటుంబాల మధ్య ఉండే షరతులు లేని ప్రేమను వేడుకగా జరుపుకోవడానికి అంతర్జాతీయ హ్యాపీ పెట్స్ డే ఉద్దేశించబడింది. ఈ సంవత్సరం, మేము చురుకైన రీతిలో  పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణను ఈ వేడుకకు కేంద్రంగా ఉంచడం ద్వారా ఆ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాము. పెంపుడు జంతువుల సంఘాలను ఒకచోట చేర్చడంతో పాటు, మేము ఆధునీకరించిన 24x7 సౌకర్యాలు, మరిన్ని కేంద్రాలలో ప్రత్యేక పశువైద్య సేవలు , పెట్ ఫస్ట్ ఎయిడ్ కిట్‌ల ఆవిష్కరణ ద్వారా మా వెటర్నరీ సేవలను  విస్తరిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమాన్ని మరింత ఆసక్తికరంగా మార్చడానికి, స్నఫుల్ మ్యాట్ ఛాలెంజ్, బెస్ట్ ట్రిక్ షోడౌన్, పెట్ బింగో వంటి విభిన్నమైన ఆటలు పెంపుడు జంతువులకు, వాటి యజమానులకు మధ్య బంధాన్ని బలపరిచాయి. ఈ జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకోవడానికి , ఇప్పటి వరకు సాగిన ఈ ప్రయాణాన్ని వేడుకగా జరుపుకోవడానికి, పెంపుడు జంతువుల యజమానులు క్యారికేచర్ మరియు ఫోటో బూత్ సెషన్‌లను కూడా ఆస్వాదించారు.