ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు ఆహ్వానం
హనుమకొండ టౌన్, మార్చి 23 (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో ప్రఖ్యాత గాంచిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల స్థాపనకు 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 29న ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించినట్లు సంఘం అధ్యక్షులు ఇ.వి శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్ పాయ్, ఎన్పీడీసీఎల్ సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి లను పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి, ఈ వేడుకలకు అతిథులుగా హాజరు కావలసిందిగా ఆహ్వానించారు.
అనంతరం వారు మాట్లాడుతూ వరంగల్ చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యనభ్యసించి, ప్రస్తుతం దేశ, విదేశాల్లో వివిధ రంగాల్లో స్థిరపడిన, పూర్వ విద్యార్థులు ఈ వేడుకలకు హాజరుకారున్నట్లు తెలిపారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళాశాల నూతన భవన నిర్మాణానికి 28 కోట్ల రూపాయలను మంజూరు చేసి, అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు జి. మహేందర్ రెడ్డి, మేకల అక్షయ్ కుమార్, కే. వెంకటేశ్వర్లు, పి. ఆనంద్ కుమార్, దొడ్డిపల్లి కుమార్, ఎం. బిక్షపతి, ఎం. ప్రకాష్, బి. విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.




