15 June, 2026 | 5:17 PM

ప్రజా వాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయవద్దు

15-06-2026 04:30 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించి ప్రజావాణి దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు రమేష్ రాథోడ్  తో కలిసి ప్రజా ఫిర్యాదులు స్వీకరించి వాటికి సత్వర పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తులు ఆన్లైన్ చేయడం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు.