29 June, 2026 | 3:01 PM

Breaking News

ఇదేం రోడ్డు?

18-10-2024 12:45 AM

ఆర్‌అండ్‌బీ అధికారులపై దుబ్బాక ఎమ్మెల్యే ఆగ్రహం 

చేగుంట, అక్టోబర్ 17: చేగుంట నుంచి గజ్వేల్ వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదా రులు ఇబ్బందులకు గురవుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆర్‌అండ్‌బీ అధికారులపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం చేగుంటలో పర్యటించిన ఆయన.. గుంతల మయంగా మారిన రోడ్డును చూసి అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, రోడ్డు పక్కన ఉన్న కరెంట్ స్తంభాలను తొలగించాలని ఆదేశించారు.