29 June, 2026 | 3:23 PM

సోనాల మండల కేంద్రంలో ఉన్న బీడీ సెంటర్ ను తరలించవద్దు

29-06-2026 02:52 PM

బోథ్, జూన్ 29 (విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో ఉన్న బీడీ సెంటర్ ను తరలించేందుకు దేశాయి బ్రదర్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుందని బీడీ సెంటర్లో పనిచేస్తున్న కార్మికులు వాపోయారు. గత 15 రోజుల నుండి బీడీ సెంటర్ ను తరలించవద్దంటూ యాజమాన్యానికి విన్నవిస్తూ వస్తున్నామని వారు తెలిపారు.అయినా యాజమాన్యం నుండి సరైన స్పందన లేదని వారు పేర్కొన్నారు.ఇక్కడ నుండి బోత్ మండల కేంద్రానికి తరలించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని పేర్కొంటూ నిరసన వ్యక్తపరిచారు.బీడీ సెంటర్ ను తరలిస్తే కోల్పోతామని వారు పేర్కొన్నారు.