28 April, 2026 | 2:16 AM

మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆరే..

28-04-2026 12:34 AM

గ్రామ గ్రామాన రెపరెపలాడిన బీఆర్‌ఎస్ జండా 

నాగిరెడ్డిపేట్,ఏప్రిల్ 27,(విజయక్రాంతి ):రాబోయే శాసనసభ ఎన్నికల్లో గెలిచేది బిఆర్‌ఎస్ పార్టీయేనని...కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అని... ఎల్లారెడ్డి గడ్డపై మరోసారి ఎమ్మెల్యే అయ్యేది నల్లమడుగు సురేందర్ విజయం ఖాయమని నాగిరెడ్డిపేట్ మండల బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అన్నారు.సోమవారం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  నాగిరెడ్డిపేట్ మండలంలోని గ్రామ గ్రామాన బిఆర్‌ఎస్ జండా రెపరెపలాడింది.నాయకులు జెండా ఆవిష్కరణ చేసి మిఠాయిలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ...బిఆర్‌ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మధ్య దళారులు లేకుండా ప్రతి పేదవాడికి అందాయని,అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారని,ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి మోసాలు చేసి 6 గ్యారంటీలు ఇస్తామని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి 3సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్ని వర్గాల ప్రజలు నిరాశ, నిస్సృహాలతో ఉన్నారని ఆరోపించారు.

420 హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు.ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ ఆధ్వర్యంలో పార్టీని పటిష్టం చేసి.ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట గడ్డలపై గులాబీ జెండా ఎగురవేస్తామని తెలిపారు.కెసిఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని,తెలంగాణ రాష్ట్రం కోసం బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించిందని 25 సంవత్సరాల పాటు ప్రజాసేవలో ఉందన్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నట్లు నాయకులు,కార్యకర్తలు తెలిపారు.కెసిఆర్ 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కేసిఆర్ ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని తేప్పించుకున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.