వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో బాగుపడింది రేవంత్ కుటుంబమే
- సీఎం దోపిడీని ప్రశ్నిస్తామనే.. సభ నుంచి సస్పెన్షన్
- ఫ్యూచర్ సిటీలో సీఎం సోదరుడికి కేటాయించిన భూమిని పరిశీలించిన కేటీఆర్
- భూ కేటాయింపులపై ఐటీ, ఈడీ విచారణకు డిమాండ్
రంగారెడ్డి, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అవినీతి(Corruption), ప్రజాధనం దోపిడీని ఎండగడతామనే భయం తోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల(BRS MLAs)ను శాసనసభ(Legislative Assembly) నుంచి కుట్రపూరితంగా సస్పెండ్(Suspend) చేశారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేపడుతున్న అక్రమాల(Irregularities)పై శాసనసభతో పాటు క్షేత్రస్థాయి నుంచి న్యాయస్థానాల వరకు పోరాటం ఆపేదిలేదని స్పష్టం చేశారు.
గురువారం మహేశ్వరం నియోజకవర్గం(Maheshwaram Constituency) తుక్కుగూడ రావిర్యాల(Thukkuguda Raviryala)లోని ఫ్యూచర్ సిటీ(Future City)లో ఇటీవల ప్రభుత్వం సీఎం సోదరుడు అనుముల కొండల్ రెడ్డి కంపెనీ టెసేరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌కు(Anumula Kondal Reddy company, Tesseract Advanced Systems) కేటాయించిన 5ఎకరాల స్థలాన్ని బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. రాష్ట్రంలో వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో బాగుపడింది సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబమేనని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.
రూ. 200 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమిని సీఎం రేవంత్ రెడ్డి తన సోదరు డు అనుముల కొండల్‌రెడ్డి కంపెనీకి కేవ లం రూ. 7 కోట్లకే.. నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. పటాన్‌చెరులోని ఒక చిన్న ఇల్లు అడ్రస్‌తో, కేవలం రూ. 1 లక్ష పెయిడ్-అప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి ప్రజా ఆస్తిని ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించా రు. ఈ అక్రమ భూ కేటాయింపులపై నిజాయతీ ఉంటే వెంటనే ఐటీ, ఈడీలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశా రు.
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న అక్రమాలపై పారిశ్రామికవేత్తలు జాగరూకతతో ఉండాలని, అక్కడ పెట్టుబడులు పెట్టి బలిపశువులు కావొద్దని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ అక్రమ కేటాయింపులను రద్దు చేసి, అర్హులైన పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తామన్నారు. ఈ అంశంపై రంగారెడ్డి జిల్లాలోని ప్రతి ఊరిలో చైతన్య సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.
సభా హక్కుల ఉల్లంఘన నోటీసు..
సోషల్ మీడియాలోని ఒక ఫేక్ ఖాతా సమాచారా న్ని అసెంబ్లీలో ప్రస్తావించి సభను, ప్రజలను తీవ్రంగా తప్పుదోవ పట్టించిన ముఖ్యమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘ న నోటీసు ఇస్తామని కేటీఆర్ వెల్లడించారు. బీ ఆర్‌ఎస్ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేస్తే నేరుగా సభకు వెళ్లి ప్ర భుత్వం చేసే ప్రతి అక్రమాన్ని ఎండగడతామన్నారు.
బీఆర్‌ఎస్ నేతల భారీ ధర్నా..
మరోవైపు రావిర్యాల/తుక్కుగూడ పరిధిలోని టెస్సెరాక్ట్ కంపెనీ వద్ద బీఆర్‌ఎస్ నాయకులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులపై గవర్నర్, లోకాయుక్తలకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ఖండన..
బీఆర్‌ఎస్ ఆరోపణలను పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ఐటీ, డిఫెన్స్ స్టార్టప్ ప్రోత్సాహకాల నిబంధనల ప్రకారం అధికారుల కమిటీ ఆమోదంతోనే.. పారదర్శకంగా భూమి కేటాయించామని, ఫోర్త్ సిటీ అభివృద్ధిని దెబ్బతీసేందుకే ప్రతి పక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని స్పష్టం చేశారు.