calender_icon.png 13 September, 2024 | 12:43 AM

ఇది పేదల ప్రభుత్వం

08-08-2024 12:42:53 AM

4, 5 నెలల్లోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు మొదలుపెడతాం 

ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తాం

ఇచ్చిన మాట మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం 

పిప్రి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

ఆదిలాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): పిప్రి గ్రామస్థులు నిండు మనసుతో ఆశీరదించడంతోనే తన పీపుల్స్ మార్చ్ విజయవంతం కావడంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుతం వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అందువల్ల ఆ యాత్రలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటానని స్పష్టంచేశారు. ఎన్నికల సమయంలో జిల్లాలోని బజార్‌హత్నూర్ మండలం పిప్రి నుంచి ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ సందర్భంగా అధికారంలోకి వచ్చిన తరాత తానే సయంగా వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తానని ఇచ్చిన హామీ మేరకు బుధవారం గ్రామంలో డిప్యూటీ సీఎం పర్యటించారు.

హెలికాప్టర్‌లో గ్రామానికి చేరుకున్న ఆయనకు కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌష్ ఆలం ఘనంగా సాగతం పలికారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని సీకరించిన భట్టి జ్యోతి ప్రజలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. అదేవిధంగా మహిళా సంఘాలకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తుమ్మడిహెట్టి పనులు ఆగిపోయాయని, ఫలితంగా ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లాకు సాగునీరు అందడం లేదన్నారు.  నాలుగైదు నెలల్లోనే నాటి సీఎం వైఎస్సార్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించి జిల్లాకు నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటా యించామని తెలిపారు. పదేళ్లలో ఐటీడీఏలను నిరీర్యం చేశారని, వాటిని బలోపేతం చేసేందుకు రూ.17 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్‌ను బలోపేతం చేసేందుకు రూ.35 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించామని, పాత పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పారు. ఆదిలాబాద్‌ను గుండెల్లో పెట్టుకొని చూసుకునే ప్రభుతం తమదని, ఇందిరమ్మ రాజ్యంలో పోడు భూములకు పట్టాలిస్తామ ని భట్టి హామీ ఇచ్చారు.

ఇది పేదల ప్రభు త్వమని చెప్పారు. గత ప్రభుతం తీసుకొచ్చి న ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని స్పష్టంచేశారు. అసెంబ్లీలో చర్చించి, అందరి ఆమోదంతో సమగ్ర భూచట్టం తెస్తామన్నారు. నాడు ప్రజలకు ఇచ్చిన మాట మేరకు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని, పబ్లిక్ సరీస్ కమి షన్‌ను ప్రక్షాళన చేసి పేపర్ లీక్ లేకుండా గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశామని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చామని, మరో 30 వేల నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుందని తెలిపారు.