ఈనెల 16న ప్రజావాణి రద్దు
నిర్మల్,(విజయక్రాంతి): ఈనెల 16 నా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించి ప్రజావాణి రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో గణన చేపడుతున్న నేపథ్యంలో ఈ ప్రజావాణి రద్దు చేస్తామన్నారు.
పదవ తరగతి బెస్ట్ ఆఫ్ లక్
నిర్మల్ జిల్లాలో శనివారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ విద్యార్థులను ఆకాంక్షించారు. జిల్లాలో పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది అన్నారు. విద్యార్థులు పరీక్ష లాంటి భయం వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు.
గ్యాస్ కొత్తపై వదంతులు నమ్మవద్దు
నిర్మల్ జిల్లాలో ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ఎల్పిజి గ్యాస్ స్టాక్ ఉందని దీనిపై వదంతులు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయన్నారు. ప్రజలు తమ అవసరాలకు మాత్రమే గ్యాస్ సిలిండర్లను వినియోగించుకుని పొదుపు పాటించాలని సూచించారు




