13 March, 2026 | 11:27 PM

బీసీ వసతి గృహాలపై ప్రత్యేక అధికారి సమీక్ష

13-03-2026 08:48 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారి డాక్టర్ ఉదయ్ ప్రకాష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఎం. రమాదేవి సమక్షంలో బీసీ వసతి గృహ సంక్షేమ అధికారులతో సమావేశమై ‘ప్రజా పాలన’ 99 రోజుల కార్యక్రమం అమలు, ఎస్‌ఎస్‌సీ విద్యార్థుల 100 శాతం ఫలితాల సాధనపై చర్చించారు. వసతి గృహాల్లో శానిటేషన్ నిర్వహణ, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించడం, ప్రతి రోజు అంశాల వారీగా ఉపాధ్యాయులతో పునశ్చరణ తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని జనకాపూర్ బీసీ బాలుర వసతి గృహం, ఆసిఫాబాద్ బీసీ బాలుర కళాశాల వసతి గృహాలను తనిఖీ చేసి ‘ప్రజా పాలన’ కార్యక్రమం అమలును పరిశీలించారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ విద్యార్థులతో మాట్లాడి వారి పరీక్షల సిద్ధతపై తెలుసుకున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత విద్య, డిగ్రీ, సాంకేతిక కోర్సుల్లో చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారులు, జిల్లా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.