calender_icon.png 14 February, 2026 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే జైలు శిక్ష

14-02-2026 08:12:42 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): బాలుడిపై దాడి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లడం జరిగింది.  తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది.  పోలీస్  వారి సూచనతో మెడికో లీగల్ కేసు కింద ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించి బాలుడిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. కుటుంబ సభ్యులతో పూర్తిస్థాయిలో విచారించి వెంటనే అంగన్వాడీ టీచర్ను పిలిపించి ఆమె జరిగిన సంఘటనపై అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అని మందలించగా తప్పు జరిగిపోయింది కొంచెం కొట్టాను అని చెప్పింది. 

పోలీసు వారు ఎఫ్ఐఆర్ నెంబర్ 36 2026 కింద భారత న్యాయ సంహిత 118 సబ్ సెక్షన్ 1 అలాగే బాలల న్యాయ చట్టం సెక్షన్ 75 ప్రకారం కేసు నమోదు చేసి నిందితురాలిగా అంగన్వాడీ టీచర్ జాజాల రాణి  వెంకటాపూర్ రెండవ అంగన్వాడి కేంద్రం టీచర్  పేరు చేర్చడం జరిగింది. మెరుగైన వైద్య చికిత్స కోసం ఎల్వీ ప్రసాద్ ప్రాంతీయ ఆసుపత్రి  సిరిసిల్ల , ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి  ముందస్తు జాగ్రత్తలో భాగంగా బాలుడని పిల్లల వైద్యుని,స్పెషలిస్ట్ వైద్యులు యొక్క పర్యవేక్షణలో ఉంచడం జరిగింది. వారి సూచన మేరకు హైదరాబాద్ నీలోఫర్ కు  తరలించడం జరిగింది.

తదనంతరం జిల్లా కలెక్టర్  పూర్తి వివరాలతో ప్రాథమిక నివేదిక అందించడం జరిగినది.   తదనంతరం అంగన్వాడీ టీచర్ కు  షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగింది. ఆమె ఇచ్చిన వివరణను పరిశీలించి సంతృప్తికరంగా లేదని  నిర్ణయించి, పూర్తిస్థాయిలో విచారణ గావించి  తుది విచారణ నివేదికను కఠిన చర్యల కోసం జిల్లా సంక్షేమ అధికారి  ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్  సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ సమర్పించిన వెంటనే అంగన్వాడి టీచర్ జాజాల రాణి పై శాఖా పరమైన చర్యలు, క్రిమినల్ చర్యలతో పాటు కఠిన చర్యలకు రంగం సిద్ధం చేశారు.

జిల్లాలో ప్రతి అంగన్వాడి కేంద్రం సురక్షితంగా ఉన్నదని, పిల్లలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎదుగుతారని ఎవరు ఎలాంటి అపోహలు పడవద్దని జిల్లా సంక్షేమ అధికారి  తెలిపారు.  మంచి పోషకాహారం అందిస్తూ బాలల హక్కులను కాపాడడంలో జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని తెలియజేశారు.ఒకవేళ ఎవరైనా ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే శాఖా పరమైన చర్యలు తోపాటు క్రిమినల్ చర్యలు చేపట్టబడుతుందని ఉద్యోగంలో నుంచి తొలగించడం లాంటి కఠినమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.