14 April, 2026 | 5:28 PM

ఆలయంలో ప్రత్యేక పూజలు

14-02-2026 08:15 PM

శ్రీదండ్లగడ్డ ప్రసన్న వీరాంజనేయ స్వామి, మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణం శివారెడ్డి గూడాలోని శ్రీదండ్లగడ్డ ప్రసన్న వీరాంజనేయ స్వామి, మల్లికార్జున స్వామి ఆలయంలో ఈనెల 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త కొంతం రామిరెడ్డి తెలిపారు. ఆలయంలో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు అభిషేకములు, 9 గంటల నుండి 12 గంటల వరకు అర్చనలు జరుగుతాయన్నారు.

సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అర్చనలు, రాత్రి 11:45 గంటలకు అంగోధ్భవ కాల అభిషేకము జరుగుతుందన్నారు.  ముందు రోజు 14వ తేదీన శనివారం ఆలయంలో సాయంత్రం 5 గంటలకు శ్రీభ్రమరాంభ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగును కావున భక్తజనులు ఈ యొక్క పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని  దేవాలయ ధర్మకర్త కొంతం రాంరెడ్డి కోరారు.