జన్వాడ ఫాంహౌస్ కేసు.. వేరే మహిళ ఫోన్ ఇచ్చిన విజయ్ మద్దూరి
28-10-2024 05:31 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): జన్వాడ ఫాంహౌస్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. విజయ్ మద్దూరి సోమవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదు. అతను గేమ్ ఆడినట్లు దర్యాప్తులో తేలితే మరో కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చిరించారు. సోదాల సమయంలో విజయ్ మద్దూరి తన మొబైల్ దాచిపెట్టి మరో మహిళ మొబైల్ ఫోన్ ను పోలీసులకు అందించినట్లు విచారణలో తెలింది. సోదాల సమయంలో రాజ్ పాకాల పరారైనట్లు పోలీసులు చెప్పారు. జన్వాడలోని వ్యాపారి రాజ్ పాకాల ఫాంహౌస్ లో శనివారం రాత్రి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమచారం అందడంతో ఆదివారం తెలవారుజామున సోదాలు నిర్వహించారు. దీంతో మోకిల పోలీసులు సోమవారం ఉదయం విచారణకు రావాలని రాజ్ పాకాలకు నోటీసులు ఇచ్చారు.




