అంతర్జాతీయ శాంతి ప్రతిభా పురస్కారం
భీమదేవరపల్లి,(విజయక్రాంతి): జర్నలిస్టు, రచయిత మాడుగుల రాజ్‌కుమార్(Journalist Madugula Rajkumar)కు అంతర్జాతీయ శాంతి ప్రతిభా పురస్కారం(International Peace Excellence Award) లభించింది. శాంతి, మానవతా సేవలు, సామాజిక ప్రభావం, సుస్థిర అభివృద్ధికి చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
వంశీ ఈవెంట్స్ అండ్ మోర్డ్ ఫౌండేషన్(Vamsi Events and More Foundation) ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ శాంతి, ప్రతిభా పురస్కారాలు–2026 లో భాగంగా డిప్యూటీ స్పీకర్ జాటో రామచంద్రం నాయక్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు.అక్టోబర్ 2న హైదరాబాద్‌లోని కింగ్‌కోటి, తిలక్‌రోడ్డులో ఉన్న తెలంగాణ సారస్వత పరిషత్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
సమాజంలో సానుకూల మార్పు కోసం చేసిన కృషిని, ప్రజల్లో స్ఫూర్తిని నింపే సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ప్రశంసాపత్రంలో పేర్కొన్నారు. మాడుగుల రాజ్‌కుమార్ తెలుగు సాహిత్యం, లింగ అధ్యయనాల్లో ఉపాధ్యాయ శిక్షణ, న్యాయ విద్య అభ్యసించారు. ఈ కార్యక్రమంలో మోర్డ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ అండేకర్ శ్రీనివాస్, నిర్వాహకుడు డాక్టర్ వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.