calender_icon.png 19 February, 2026 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులు సామాజిక బాధ్యతతో మెలగాలి

19-02-2026 12:51:30 PM

మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

రంగారెడ్డి, ఫిబ్రవరి 19: జర్నలిస్టులు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని, వృత్తిపరమైన విలువలను కాపాడుకుంటూనే సామాజిక హితం కోసం పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి(Media Academy Chairman Srinivas Reddy) పిలుపునిచ్చారు. నాంపల్లిలోని మీడియా అకాడమీ కార్యాలయంలో టీయూడబ్ల్యూజే (TUWJ) ఆధ్వర్యంలో రూపొందించిన 'రంగారెడ్డి జిల్లా మీడియా డైరీ - 2026' ను ఆయన ఆవిష్కరించారు. ​జర్నలిస్టు కుటుంబాలకు అండగా అకాడమీ ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం అకాడమీ అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ​మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు అకాడమీ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. చనిపోయిన జర్నలిస్టుల భార్యలకు ఐదేళ్ల పాటు నెలకు ₹3,000 పెన్షన్ అందజేస్తాం.వారి పిల్లలు 10వ తరగతి లోపు చదువుతుంటే, ప్రతి నెలా ₹1,000 చొప్పున సాయం అందిస్తాం. జర్నలిస్టులకు ₹5 లక్షల ప్రమాద బీమా కల్పించడంతో పాటు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు.

రంగారెడ్డి యూనిట్ కృషి ప్రశంసనీయం

​రంగారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి యూనియన్ చేస్తున్న కృషిని చైర్మన్ కొనియాడారు. ముఖ్యంగా షాబాద్‌కు చెందిన మృతి చెందిన జర్నలిస్ట్ రాములు కుటుంబానికి ₹8 లక్షల ఆర్థిక సాయం అందించి అండగా నిలవడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ​నిరంతర పోరాటమే టీయూడబ్ల్యూజే లక్ష్యం ​టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడే ఏకైక సంస్థ టీయూడబ్ల్యూజే - ఐజేయూ అని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా వైద్య, విద్యా రంగాల్లో యూనియన్ చేస్తున్న సేవలను ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు.

​సమగ్ర సమాచారంతో మీడియా డైరీ ​జిల్లా అధ్యక్షులు ఎం.డి. సలీమ్ పాషా మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమగ్ర సమాచారంతో ఈ 2026 డైరీని రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే పలు చోట్ల ఆరోగ్య శిబిరాలు నిర్వహించామని, త్వరలోనే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా వీటిని పూర్తి చేస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, విరహత్ అలీ, శ్రీకాంత్ రెడ్డిలను శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, జాతీయ కౌన్సిల్ సభ్యులు ప్రవీణ్, జిల్లా కోశాధికారి శశిపాల్ రెడ్డి, వివిధ నియోజకవర్గాల ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మరియు సీనియర్ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.