జర్నలిస్టుల డిమాండ్ల దినోత్సవం

01-10-2026 | 05:12pm

జనగామ, అక్టోబర్ 1 (విజయక్రాంతి): జర్నలిస్టుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU)(Indian Journalists Union) పిలుపు మేరకు అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున జనగామలో నిరసన చేపట్టనున్నట్లు TUWJ-IJU జిల్లా అధ్యక్షుడు ఇర్రి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి సురిగల బిక్షపతి తెలిపారు. జనగామలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ రేపు ఉదయం 10 గంటలకు నెహ్రూ పార్క్ వెళ్లే మార్గంలో కళ్యాణ్ సిల్క్స్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద శాంతియుత ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలోని జర్నలిస్టులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నూతన మీడియా కమిషన్ ఏర్పాటు

జర్నలిస్టుల భద్రత కోసం జాతీయ చట్టం కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత వైద్యం ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పార్నంది వెంకటస్వామి, కోశాధికారి ఓరుగంటి సంతోష్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు కెమిడి ఉపేందర్, గణేష్, ఎల్లారెడ్డి, కిరణ్, శ్రీకాంత్ రెడ్డి, ఆనంద్, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు