పాత్రికేయుల సంక్షేమమే మా ప్రధాన అజెండా
మంథని జ్యోతి కొండెల మారుతి
మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ లో మారుతికి ఘన సన్మానం
మంథని, సెప్టెంబరు 27(విజయ క్రాంతి): పాత్రికేయుల సంక్షేమమే మా ప్రధాన అజెండా అని మంథని జ్యోతి కొండెల మారుతి అన్నారు. ఆదివారం మంథని లోని మీడియా ప్రెస్ క్లబ్(Media Press Club) లో మంథని విద్యార్థి యువత వ్యవస్థాపక అధ్యక్షులు కొండెల మారుతి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రజాసమస్యలపై ఆయన చూపుతున్న చొరవను, విద్యార్థి యువత హక్కుల కోసం చేస్తున్న పోరాటాలను అభినందిస్తూ ఆయన్ను "మంథని జ్యోతి"గా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొడారి మల్లేష్ యాదవ్ ప్రధాన కార్యదర్శి మహావాది సతీష్ కుమార్ కొనియాడారు.
స్థానిక విద్యార్థుల సమస్యలు, సామాజిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలపై కొండెల మారుతి నిరంతరం స్పందిస్తూ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ముందుండి నడిపిస్తున్నారనీ కొనియాడారు. మంథని ప్రాంతంలో విద్యార్థుల హక్కుల పరిరక్షణకు, స్థానిక సమస్యలపై గళం విప్పడానికి మారుతి సేవలు ఎంతో విలువైనవని వక్తలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాత్రికేయులు, ఎగోలపు సంతోష్ గౌడ్, కాచర్ల శంకర్, మంథని లక్ష్మణ్, రామడుగు సాయి శ్రీనివాస్, మెడగొని రాజమౌళి గౌడ్, కాశీపేట శ్రీకాంత్, మాదేశి శ్రావణ్, ఎండీ. సుభాన్, రావుల రాజ్ కుమార్, కావేటి సమ్మయ్య, అమ్ము శ్రీనివాస్, స్థానిక ప్రముఖులు పాల్గొని మారుతికి శుభాకాంక్షలు తెలియజేశారు.