07-12-2025 12:09:15 AM
మహబూబాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): వరంగల్ నగరంలోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఇటీవల పీజీ పరీక్ష పత్రాల వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో వీసీగా డాక్టర్ నందకుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.ఈ నేపథ్యంలో యూనివర్సిటీకి డాక్ట ర్ కే రమేశ్ రెడ్డిని ఇన్‌చార్జి వీసీగా ప్రభు త్వం నియమించింది. ప్రస్తుతం భువనగిరి వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్ రెడ్డి గత 25ఏళ్లుగా పిల్లల వై ద్యుడిగా గుర్తింపు పొందారు.
అలాగే రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు, వైద్య విధాన పరిషత్ కమిషనర్, నిలోఫర్ ఆస్పత్రి సూపరిం టెండెంట్, గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ గా పలు పదవులు నిర్వహించారు. ఈ మే రకు డాక్టర్ రమేశ్ రెడ్డి కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి ఉపకులపతిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అస్తవ్యస్తంగా మారిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ రమేష్ రెడ్డి నేతృత్వంలో తిరిగి గాడిలో పడుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.