స్ఫూర్తి చేయూతతో పాఠశాలలకు బల్లల పంపిణీ

28-09-2026 | 04:38pm

రూ.3.40 లక్షల విలువైన బల్లాలు అందజేత

కల్లూరు, సెప్టెంబర్ 28 (విజయ క్రాంతి): కల్లూరు మండలం చెన్నూరు పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక(Government primary) పాఠశాలలకు అమెరికా ఆశ్రయ సంస్థ ఆర్థిక సహకారంతో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.3.40 లక్షల విలువైన 50 డ్యూయల్ డెస్క్ బల్లాలు అందజేశారు.చెన్నూరు పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థులు బల్లాలు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రధానోపాధ్యాయురాలు వి. ఝాన్సీరాణి స్ఫూర్తి ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లగా, 15 రోజుల్లోనే బల్లాలను సమకూర్చారు.

చెన్నూరు పాఠశాలకు 12, చెన్నూరు మరో పాఠశాలకు 15, వెంకటరాంపురానికి 14, రావికంపాడుకు 5, అడవిబోడిమల్లె పాఠశాలకు 4 బల్లలు కేటాయించారు.బల్లాలు అందడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్లజాల కిషోర్, ప్రధానోపాధ్యాయులు మధు, యర్నం అప్పారావు,మందడపు రమాదేవి,యర్నం నాగరాజు, ధరావత్ రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు