14 August, 2026 | 10:52 PM

శ్రీ మహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం

14-08-2026 09:45 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): పోచారం డివిజన్ పరిధి కొర్రెముల లోని శ్రీమహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి ఆలయంలో శివపార్వతుల మంగళస్నానాలు, కళ్యాణ మహోత్సవం మాజీ సర్పంచ్ ఓరుగంటి కవిత వెంకటేష్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ కందుల రాజు దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తజనులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పిర్జాదీగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాజీ జెడ్పిటిసి మంద సంజీవరెడ్డి, స్థానిక పంచాయతీ మాజీ పాలక వర్గం సభ్యులు పాల్గొని కళ్యాహ మహోత్సవాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దైవ భక్తిని పెంపొందించుకోవాలని, దానితో సుఖశాంతులు ఆయురారోగ్యాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసిలు బొడ్డు వినోద నాగార్జున, కుర్రి విఘ్నేష్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు నాయకులు దయ్యాల అంజనేయులు, కోళ్ల యాదగిరి, బద్దం జగన్ మోహన్ రెడ్డి, పసుమాల కృష్ణ, పసుమాల బాలరాజ్, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.