16 April, 2026 | 9:04 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

పాల్వంచలో జెన్కో నీటి పైప్‌లైన్‌కు కన్నం

02-03-2026 12:00 AM

అక్రమంగా ప్రైవేట్ విల్లాకు కనెక్షన్

జన్కో నీటి చోరీకి స్కెచ్ 

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 1 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని జెన్కో నీటి పైపుకు కన్నం వేసి అక్రమంగా ప్రైవేట్ విల్లాకు కనెక్షన్ కనెక్షన్ ఇచ్చి నీటి చోరీకి స్కెచ్ వేస్తున్న వైనం ఇది.  ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే శనివారం రాత్రి సుమారు పది గంటలకు ప్రియదర్శని కాలనీలోని సదరు విల్లా సమీపంలో కొందరు వ్యక్తులు రహస్యంగా గుంటలు తీస్తున్నారు.

దీనిపై సమాచారం అందుకున్న జన్కో సివిల్ డిపార్ట్మెంట్ అధికారి ముత్తయ్య క్షేత్రస్థాయికి చేరుకొని తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు గుంటలు తీస్తూ అధికారులకు పట్టుబడ్డారు. వారి నీ అధికారి విచారించగా మొదట పొంతనలేని సమాధానం చెప్పి, ఆ తర్వాత అసలు విషయాన్ని బయట పెట్టారు. ప్రైవేట్ బిళ్ళ వాటర్ ట్యాంకు జెన్కో నీటిని మళ్లించేందుకే ఈ తవ్వకాలు చేపట్టినట్లు తేలింది. అక్రమ కనెక్షన్ కు భారీ మొత్తంలో నగదు చేతులు మారినట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి.

నీటి చోరీ వ్యవహారంలో కేటీపీఎస్ కు చెందిన ఉద్యోగితో పాటు మరి కొంతమంది ప్రముఖల పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. ప్రైవేట్ విల్లా యాజమాన్యాల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి ప్రభుత్వ నీటిని అక్రమంగా మళ్ళించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. జన్కో పైప్ లైన్ నుండి నీటిని దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కేటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ వనరులకు ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా ధారాధత్వం చేస్తున్న వారిపై విచారణ జరిపించాలని ప్రదర్శన కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.