27 June, 2026 | 4:39 PM

మత్తుకు యువత చిత్తు కావొద్దు

27-06-2026 03:23 PM

నిర్మల్,(విజయక్రాంతి): దేశ అభ్యున్నతి యువతపై ఆధారపడి ఉన్నందుని అటువంటి యువకులు మత్తు కు బానిసలై జీవితం చిత్తు చేసుకోవద్దని నిర్మల్ జూనియర్ సివిల్ జడ్జ్ పి రవీందర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్జీపి డిగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్ పై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. మత్తు పనులు అలవాటు చేసుకోవడం ఆ కుటుంబంలో చిన్న అభినం చేస్తుందని తెలిపారు. మత్తు సేవించిన విక్రయించిన ప్రోత్సహించిన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి ప్రిన్సిపల్ విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.