తెరపైకి అన్నాచెల్లెళ్ల వార్‌

29-09-2026 | 01:13pm

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ నుంచి తనను సస్పెండ్‌ చేసిన తీరుపై టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత(Kavitha) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ నేతను విమర్శించిన కొన్ని గంటల్లోనే తనపై పార్టీ చర్యలు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. అదే సమయంలో పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయాలను బహిరంగంగా విమర్శిస్తున్న వారు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడటం కాదా? అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి: రెడ్‌హిల్స్‌లో ‘ఇందిరమ్మ’ అడుగు

పార్టీ పరిస్థితికి ఫామ్‌హౌస్‌లు, అనుమతులు, విధానపరమైన నిర్ణయాలే కారణమంటూ కవిత పలు ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్‌ సమావేశంలో రైతు, మహిళ పట్ల కొందరు వ్యవహరించిన తీరుపైనా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా తాను మాట్లాడనని పేర్కొంటూ, “నాతో పెట్టుకోకు” అంటూ తన ఎక్స్‌ ఖాతాలో కేటీఆర్‌ ఫొటోను పోస్టు చేసి హెచ్చరించారు.కాగా, 2025 సెప్టెంబర్‌లో కవితను బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.


మరిన్ని వార్తలు