'ది ట్రేటర్స్' తెలుగు.. ప్రోమో అదిరింది!

29-09-2026 | 04:26pm

ది ట్రేటర్స్ తెలుగు ప్రైమ్ రియాలిటీ షోపై ఆసక్తిని పెంచేలా తాజాగా ప్రోమో విడుదలైంది. ప్రోమోలో వినిపించిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటంతో షోపై అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తేజ సజ్జ చెప్పిన డైలాగ్ డెలివరీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ రియాలిటీ సిరీస్‌లో గేమ్, వ్యూహాలు, నమ్మకం, మోసం వంటి అంశాలు ప్రధానంగా ఉండనున్నట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది. ప్రోమోలోని ఆసక్తికరమైన సన్నివేశాలు షోపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. అక్టోబర్ 15 నుంచి ది ట్రేటర్స్ తెలుగు కొత్త రియాలిటీ సిరీస్‌గా ప్రారంభం కానుంది. దీంతో ఈ షో కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


మరిన్ని వార్తలు