రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కేరళ మోడల్ హై స్కూల్ విద్యార్థులు
అభినందించిన ప్రిన్సిపల్ సీజ్జు ఎస్ నాయర్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ లో అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి, అందులోఅండర్ 16 బాలబాలికల విభాగంలో 1 కిలోమీటర్ల పరుగుపందంలో కె యశ్వంత్, ఎ, వైశాలి, రెండవ స్థానం రెండు కిలో మీటర్ల పరుగులో టి సాయి విష్ణు, పి ఆరాధ్య,రెండవ స్థానం , అండర్ 14 విభాగంలో 600 మీటర్ల పరుగులో మొదటి స్థానం ,కె వినూత్న రెండవ స్థానం జి, చరిత సాధించారు. వీరు నెల 18 వ తేదీన మెదక్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొననున్నారు అని పెద్దపల్లి అథ్లెటిక్స్ సెక్రటరీ కె గట్టయ్య తెలిపారు, వీరిని కేరళ మోడల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ సీజ్జు ఎస్ నాయర్,వైస్ ప్రిన్సిపాల్ స్మిత ఎస్ నాయర్ ,రాజయ్య, కిరణ్, పిఈటీలు అజయ్ ,రాజు , ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు.






