14 July, 2026 | 5:46 PM

విద్యార్థి సంఘ నాయకుల అరెస్ట్

14-07-2026 05:14 PM

నిర్మల్,(విజయక్రాంతి): విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థి సంఘాల జేఏసీ హైదరాబాద్ ధర్నాకు వెళ్తున్న జిల్లా నేతలను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎస్ఎఫ్ఐ పీడీఎస్యు ఇతర విద్యార్థి సంఘ నాయకులను మంగళవారం ఉదయమే అదుపులో తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీసు నిర్బంధంతో ఉద్యమాలు ఆగమని నేతలు వెంకటేష్ దిగంబర్ రమేష్ తెలిపారు.