14 July, 2026 | 6:00 PM

మాజీ ఎమ్మెల్యే దివంగత గుండా మల్లేష్ 79 జయంతి వేడుకలు

14-07-2026 05:24 PM

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమ్యూనిస్టు పక్ష  నేత కామ్రేడ్ గుండా మల్లేష్  79వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గుండా మల్లేష్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అలాగే కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ ఐ నాయకులు మాట్లాడారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రత్యక్షమయ్యేవాడనీ తెలిపారు. 

దున్నేవానికి భూమి కావాలని, పౌర హక్కులకై నిరంతరం శ్రమించిన కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడనీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి, రాష్ట్ర సమితి సభ్యురాలు బి పూర్ణిమ, బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్, సీనియర్ నాయకుడు చిప్ప నరసయ్య ,పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌలి,నాయకులు డిఆర్ శ్రీధర్, గుండ సరోజక్క, రత్నం రాజo, కొండుబానేస్,  స్వామి దాస్, గుండ ప్రశాంత్, గుండా శంకర్ మహేందర్ రెడ్డి,  మహిళా సమైక్య నాయకురాలు బొల్లం సోనీ స్వర్ణలత పాల్గొన్నారు.