ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీకి కీలక బాధ్యతలు

12-09-2026 | 03:53pm

శాసన మండలి కార్యనిర్వహణ చైర్మన్‌గా ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు

పెద్దపల్లి సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణ శాసన మండలి తాత్కాలిక కార్యనిర్వహణ చైర్మన్‌గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్ (MLC Taniparthi Bhanuprasad)రావుకు అవకాశం లభించింది. శాసన మండలిలో మోస్ట్ సీనియర్ సభ్యుడిగా ఉన్న భానుప్రసాద్ రావు ప్రస్తుతం కార్యనిర్వహణ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.భానుప్రసాద్ రావు కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

2009లో తొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికై రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో కొనసాగిన ఆయన 2023 ఫిబ్రవరిలో తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్‌గా బాధ్యతలు చేపట్టారు. 2024 జూలైలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.తాజాగా శాసన మండలి కార్యనిర్వహణ చైర్మన్‌గా కీలక బాధ్యతలు చేపట్టడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, శాసన మండలిలో సీనియర్ సభ్యుడిగా ఉన్న భానుప్రసాద్ రావుకు ఈ బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వార్తలు