ఖానాపురం.. కరువైంది జేపీ భవనం..!
- ఐదు దశాబ్దాలుగా పీర్ల చావడే కార్యాలయం
- పక్కా భవనం నిర్మించాలని గ్రామస్థుల వేడుకోలు..
కోదాడ (అనంతగిరి), ఆగస్టు 3 : అనంతగిరి మండల కేంద్రానికి కూతవేటు దూ రంలో ఉన్న గ్రామం సుమారు 1,600 జనాభా కానీ గ్రామపంచాయతీకి మాత్రం నేటికీ సొంత భవనం లేదు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా అనంతగిరి మండలం ఖానాపురం గ్రామపంచాయతీకి పక్కా కా ర్యాలయం మాత్రం కలగానే మిగిలింది. ఐదు దశాబ్దాలుగా పీర్ల చావడిలోనే గ్రామపాలన కొనసాగుతుండగా, ఆ భవనం ఇప్పుడు శిథిలావస్థకు చేరి అధికారులు, సిబ్బంది, గ్రామస్థులను నిత్యం భయాందోళనకు గురిచేస్తోంది.
ఒకప్పుడు తాత్కాలికంగా ప్రారంభ మైన కార్యాలయం కాలక్రమేణా శాశ్వతంగా మారిపోయింది. ప్రస్తుతం పైకప్పు పెచ్చులూడి, ఇనుప చువ్వలు బయటకు కనిపి స్తుండటంతో ఎప్పుడు కూలిపోతుందోనన్న భయం నెలకొంది. ఒక చిన్న గదిలో గ్రామపంచాయతీ కార్యాలయం, మరో గదిలో రెవెన్యూ సిబ్బంది విధులు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు కార్యాలయంలోకి అడుగుపెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది.
శిథిల భవనానికి తాళం..అద్దె భవనానికి బాట
పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో భద్రత దృష్ట్యా అధికారులు కార్యాల యాన్ని అద్దె భవనానికి తరలించారు. దీంతో ప్రతి నెల అద్దె చెల్లింపుల భారం గ్రామపంచాయతీపైనే పడుతోంది. అభివృద్ధి పనుల కు వినియోగించాల్సిన నిధులు అద్దె చెల్లింపులకే వెచ్చించాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రికార్డులకూ ముప్పే.. ఉద్యోగులకూ భయమే:
వర్షాలు కురిస్తే గోడలకు నెమ్ము చేరి పంచాయతీ, రెవె న్యూ శాఖలకు సంబంధించిన కీలక రికార్డులు దెబ్బతినే ప్రమాదం ఉందని సిబ్బంది చెబుతున్నారు. గోడలు బీటలు వారడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. గ్రామసభలు, రైతుల సమావేశాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేందుకు తగిన స్థలం లేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.
మండల కేంద్రం పక్కనే..కానీ కనీస వసతులు కరువు
నూతన మండలంగా అనంతగిరి ఏర్పడి ఏళ్లు గడిచినా, మండల కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న ఖానాపురం గ్రామానికి ఇ ప్పటికీ పక్కా గ్రామపంచాయతీ భవనం లేకపోవడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నా రు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కం టే ముందుగానే ప్రభుత్వం నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
పక్కా భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ
గ్రామపంచాయతీకి సొంత భవనం లేక ప్ర జలు, అధికారు లు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్న విషయాన్ని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లాము. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, త్వ రలోనే గ్రామపంచాయతీకి పక్కా భవ నం నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల చిరకాల కోరిక త్వరలోనే తీర్చేందుకు తగిన కృషి చేస్తున్నాం.
లాజర్, సర్పంచ్, ఖానాపురం






