4 August, 2026 | 1:49 AM

నరకప్రాయంగా ప్రయాణం

04-08-2026 12:00 AM

అధ్వానంగా సురంగల్ వెంకటాపూర్ రోడ్డు 

ఎమ్మెల్యే స్పందించాలని ప్రజల డిమాండ్

మొయినాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): మొయినాబాద్ మండలంలోని సురంగల్‌ వెంకటాపూర్ ప్రధాన రహదారి భారీ గుం తలతో నిండి అడుగడుగునా ప్రమాదకరం గా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు రో డ్డు పూర్తిగా దెబ్బతినడంతో ఈ మార్గంలో ప్రయాణం నరకయాతనగా మారిందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ మార్గం గుండా ప్రతిరోజూ ప్రయాణించే వి ద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రో గుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. పెద్ద పెద్ద గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారని, అయినా సంబంధిత అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యే గారు మా గోడు చూడండి..

రోడ్డు దుస్థితిపై స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయ్యా ఎమ్మెల్యే కాలే యాదయ్య గారూ.. మా గోడు మీకు వినిపించడం లేదా? ఈ గుంతల రోడ్డుపై మేము ఎలా ప్రయాణించాలో మీరే చెప్పండి‘ అని ప్రశ్నిస్తున్నారు.

శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి..

ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణమే స్పందించి తాత్కాలిక ప్యాచ్వర్క్లతో సరిపెట్టకుండా రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని, ప్రజల ఇబ్బందులను తొలగించాలని సురంగల్-వెంకటాపూర్ గ్రామస్థులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

అధికారులు పట్టించుకోవడం లేదు..

రోడ్డు పనులు ఆలస్యం కావడంతో గ్రామ ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. ఇటీవల వానలు రావడం తో రోడ్డు పై భారీ గుంతల ఏర్పడ్డాయి. రాత్రి పూట  రావాలంటేనే  ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఇప్పటికైనా ప్రజల తిప్పలు చూసి మరమ్మత్తు పనులు చేపట్టాలి. 

 అర్చనారెడ్డి, సర్పంచ్ వెంకటాపూర్

ఎమ్మెల్యే హామీ ఇచ్చారు..

రోడ్డు పనుల విషయంలో ప్రభుత్వం అధికారులను కలిసి  ప్రజల ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లాం.ఎమ్మెల్యే కాలే యాదయ్య సానుకూలంగా స్పందించారు. త్వరలో రోడ్డు పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు.

 గడ్డం లక్ష్మి వెంకట్ రెడ్డి, కౌన్సిలర్, 13వార్డు

14 కిలోమీటర్లు తిరుగుతున్న..

‘మా ఊరు నుంచి మొయినాబాద్కు సురంగల్ మీదుగా కేవలం 5 కిలోమీటర్లే. కానీ రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ఆ మార్గంలో వెళ్లలేక అందాపూర్‌జేబీఐఈటీ చౌరస్తా మీదుగా 14 కిలోమీటర్లు నిత్యం తిరిగి వెళ్లాల్సి వస్తోంది. సమయం, ఇంధనం రెండూ వృథా అవుతున్నాయి. అధికారులు వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలి.

 శ్రీశైలం, స్థానికుడు