12 May, 2026 | 11:28 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

మే 10న జన ఆగ్రహ సభ.. పార్టీ నాయకులతో కిషన్ రెడ్డి విస్తృత స్థాయి సమావేశం

03-05-2026 11:10 AM

హైదరాబాద్‌: మే 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబడనున్న జన ఆగ్రహ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచ్చేయనున్నారు. ఈ జన ఆగ్రహ సభను విజయవంతం చేయుటకు సంబంధించి నాగోల్ డివిజన్ లోని  శుభం కన్వెన్షన్ హాల్లో ముఖ్యమైన విస్తృత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొని దశ దిశ నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్, వివిధ డివిజన్ ల కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతోపాటు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయి నాయకులు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు, బూత్ స్థాయి కమిటీ సభ్యులు హాజరయ్యారు.