10 July, 2026 | 9:04 PM

ఘనంగా కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

10-07-2026 07:20 PM

గంభీరావుపేట,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి  జన్మదిన వేడుకలను గంభీరావుపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పర్ష హన్మాండ్లు, మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల సమక్షంలో బర్త్‌డే కేక్ కట్ చేసి, టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పర్ష హన్మాండ్లు, హమీద్ మాట్లాడుతూ కేకే మహేందర్ రెడ్డి అసలైన తెలంగాణ వాది అని, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తూ సాదాసీదా జీవితం గడిపే నాయకుడని కొనియాడారు.

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా ప్రజల పక్షాన నిలిచిన నాయకుడని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా నిజాయితీతో ప్రజాసేవలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రాకముందే ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, వామపక్ష భావజాలంతో అట్టడుగు వర్గాల కోసం సేవ చేసిన చరిత్ర ఆయనదేనని అన్నారు. అలాగే, ప్రభుత్వం ఏర్పడిన తరువాత సిరిసిల్ల నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో కేకే మహేందర్ రెడ్డి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.