10 July, 2026 | 9:02 PM

అనారోగ్య బాధితుడికి ఎల్‌వోసి అందజేత

10-07-2026 07:22 PM

గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన గొల్ల బాలలింగం అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని రాజుపేట మాజీ సర్పంచ్ అల్లే సత్యం సిరిసిల్ల ఎమ్మెల్యే  దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా రూ.2,40 వేల విలువైన ఎల్‌వోసి మంజూరు చేసి, ఆ ఎల్‌వోసి కాపీని నిమ్స్ ఆసుపత్రిలోనే బాధితుడు బాలలింగానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేటీఆర్‌కు రాజుపేట బీఆర్ఎస్ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.