22 May, 2026 | 3:42 PM

Breaking News

మార్కెట్లో నిండుకున్న జొన్న మొక్కజొన్న పంట   •   బాలల హక్కుల పరిరక్షణకు సమిష్టి కృషి అవసరం   •   శ్రీ కృష్ణ దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు   •   దేశంలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం   •   ఎండిన వాగుకు జీవం పోస్తున్న చెక్ డ్యాములు   •   అడ్మిషన్ లు ప్రారంభం.. విద్యార్థినిలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే   •   భాగ్యరెడ్డి వర్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తి   •   మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు   •   మక్కలు వెంటనే తరలించాలని తహసీల్దార్ కు వినతి   •  

కోహ్లీ ఎన్నాళ్లకెన్నాళ్లకు

31-01-2025 01:21 AM

న్యూఢిల్లీ: పుష్కరకాలం తర్వాత రంజీల్లో బరిలోకి దిగిన టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని చూసేందుకు అభిమానులు ఢిల్లీ స్టేడియానికి పోటెత్తారు. నేడు ప్రారంభమైన రంజీ ట్రోఫీ ఏడో రౌండ్‌లో రైల్వేస్‌తో ఢిల్లీ ఆడుతోంది. మ్యాచ్ చూడడానికి 10 వేల మంది వస్తారని భావించిన డీడీసీఏకు ఊహించని షాక్ తగిలింది.

దాదాపు 15 వేల మంది అభిమానులు స్టేడియానికి రావడం విశేషం. తొలి రోజు గ్రౌండ్‌లో ఉత్సాహంగా కనిపించాడు. వికెట్ పడినప్పుడల్లా బౌలర్లను అభినందించాడు. నేడు కోహ్లీ బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో అభిమానుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే  రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌటైంది.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. బెంగాల్‌తో మ్యాచ్‌లో పంజాబ్ 191 పరుగులకు ఆలౌటైంది.విదర్భను 190 పరుగులకే కుప్పకూల్చిన హైదరాబాద్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.