1 April, 2026 | 5:25 PM

సూర్య మెరిసేనా?

31-01-2025 01:23 AM

* నేడు భారత్, ఇంగ్లండ్ నాలుగో టీ20

* రాత్రి 7 గంటల నుంచి 

పుణే: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా నేడు పుణే వేదికగా భారత్ నాలుగో టీ20 ఆడనుంది. ఇప్పటివరకు 2 ఆధిక్యంలో ఉన్నప్పటికీ గత మ్యాచ్‌లో ఓటమి భారత్‌ను దెబ్బతీయగా.. ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. బ్యాటర్ల సమిష్టి వైఫల్యం మూడో టీ20లో భారత్‌ను పరాజయం వైపు నడిపించింది.

ఓపెనర్ సంజూ శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ పేలవ ఫామ్ జట్టును ఇబ్బంది పెడుతోంది. ఈ మ్యాచ్‌లో వీరిద్దరు రాణించకపోతే వేటు పడడం ఖాయం. గతేడాది బంగ్లాదే శ్, సౌతాఫ్రికాలతో జరిగిన టీ20 సిరీస్‌ల్లో శతకాలతో విజృంభించిన శాంసన్ ఇంగ్లండ్‌పై మాత్రం విఫలమవుతున్నాడు.

అభిషేక్, తిలక్ వర్మ, ఆల్‌రౌండర్లు పాండ్యా, అక్షర్, సుందర్‌లు రాణిస్తే జట్టుకు తిరుగుండదు. గత మ్యాచ్‌లో షమీ విఫలమైనప్పటికీ మరో అవకాశం ఇవ్వనున్నారు. స్పిన్నర్ బిష్ణోయిని పక్కనబెట్టే చాన్స్ ఉంది. అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి రాణిస్తుండడం సానుకూలాంశం. మరోవైపు గత మ్యాచ్ విజయంతో ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్న ఇంగ్లండ్ సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.