23న కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణ

04-10-2026 | 07:53pm

ఉట్నూర్, అక్టోబర్ 04( విజయక్రాంతి ): ఆదివాసుల అమరవీరుడు కొమరం భీమ్ విగ్రహాన్ని(Statue of Komaram Bheem) ఈనెల 23వ తేదీన  ఆవిష్కరించుటకు సార్ మేడిలు, గ్రామాల పటేళ్లు నిర్ణయించారు. ఆదివారం ఇంద్రవెల్లి మండల(Indravelli Mandal) కేంద్రంలోని అమరవీరుల స్మారక స్థూపం(Martyrs' Memorial Column) వద్ద  ఉట్నూర్ డివిజన్లోని వివిధ వాయిస్ సెంటర్ల సార్ మేడిలు, ఆయా గ్రామాల పటేళ్లు  ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో విగ్రహావిష్కరణకు  రాయి సెంటర్ ల వారిగా  ఈనెల 10వ తేదీ నుండి  ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పెద్ద సంఖ్యలో ఆదివాసి గిరిజనులు పాల్గొనే విధంగా  అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సార్ మేడిలు  మెస్రం వెంకట్రావు, మెస్రం దుర్గు, మెస్రం చిన్ను పటేల్, కోట్నక బీర్ షాప్  ల తో పాటు  గ్రామాల పటేళ్లు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు