కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
ముకరంపుర, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్(Mayor Kolagani Srinivas) అన్నారు. కరీంనగర్ లో తెలంగాణ తొలితరం ఉద్యమం నాయకుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో పద్మశాలి సంఘం ఆద్వర్యంలో జరిగిన వేడుకలకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు పాలకవర్గ సభ్యలు, పద్మశాలి సంఘం నాయకులతో కలిసి మేయర్ ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కొండ లక్ష్మణ్ బాపూజీ దేశం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు వాసాల రమేష్, మాసం గణేష్, చొప్పరి జయశ్రీ వేణు, వేముల కవిత చంద్రశేఖర్, పద్మశాలి సంఘం నాయకులు మెతుకు సత్యం తదితరులు పాల్గొన్నారు.