కొండ లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శనీయం

27-09-2026 | 03:07pm

కరీంనగర్ సిటీ సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) నేటి తరానికి ఆదర్శప్రాయుడని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్(Mayor Kolagani Srinivas) అన్నారు. కరీంనగర్‌లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్న కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆయన 111వ జయంతి వేడుకలను జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మెతుకు సత్యం, గౌరవ అధ్యక్షుడు వాసాల రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ సమాజం కోసం, ప్రజల హక్కుల కోసం విశేషంగా కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. తొలి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన, ప్రజా ఉద్యమం కోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యాగం చేసి పోరాట పంథాను ఎంచుకున్నారని గుర్తుచేశారు.

కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితం, పోరాటం, సేవలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. నేటి యువత ఆయన జీవితాన్ని పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవ సమాజ అభివృద్ధికి పాటుపడాలన్నారు.

జయంతి వేడుకలను పురస్కరించుకుని జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మెతుకు సత్యం ఆధ్వర్యంలో  స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వాసాల రమేష్, చొప్పరి జయశ్రీ, మాసం గణేష్, తేళ్ల లక్ష్మీ రమేష్, దేవసాని సరస్వతి సత్యనారాయణ, వేముల కవితా చంద్రశేఖర్, పాడిశెట్టి లక్ష్మీ భూమయ్య జిల్లా పద్మశాలి సంఘం నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి వోల్లాల కృష్ణ హరి, కోశాధికారి అలుస భద్రయ్య, పోపా అధ్యక్షుడు పోలు సత్యనారాయణ, యువజన సంఘం అధ్యక్షుడు గుడిమల్ల శ్రీకాంత్, పోపా మాజీ అధ్యక్షుడు చేరాల మల్లికార్జున్ దేవ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వోడ్నాల రవీందర్, ప్రచార కార్యదర్శి మార్త ప్రకాష్, జిల్లా నాయకులు స్వర్గం నర్సయ్య, వంగర ఆంజనేయులు,వేముల చంద్రశేఖర్, అడిచర్ల రాజు, మెతుకు వంశీకృష్ణ, వంగర రవీందర్, మెతుకు కృష్ణ చైతన్య, గర్దాస్ సతీష్, గుండేటి శివ, అరుకాల నాగేందర్, రెడ్డి సంఘం జిల్లా నాయకుడు వాడే వెంకటరెడ్డి వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు