జుక్కల్‏లో ఘనంగా కొండా లక్ష్మబ్ బాపూజీ జయంతి

27-09-2026 | 04:21pm

జుక్కల్, సెప్టెంబర్ 27 (విజయ క్రాంతి): తెలంగాణ సాదనే లక్ష్యంగా అవిశ్రాంత కృషి చేసిన నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని ప్రజలు కొనియాడారు. ఆదివారం జుక్కల్ మార్కండేయ మందిరం లో పద్మశాలి సంఘం అద్వర్యం లో కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు బోడ సాయిలు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో సంఘం నాయకులు బాపూజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి అయన సేవలను కొనియాడారు.

బోడ సాయిలు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటం, బడుగు బలహీన వర్గాల సంఘటీతం, తెలంగాణ సాధన తొలి, మలితరం ఉద్యమం, చేనేత వర్గాలకు మద్దత్తుగా అయన ఉద్యమాలు నడిపారని గుర్తు చేశారు. మంత్రి పదవిని సైతం వదిలి తెలంగాణ కోసం పోరాడిన బాపూజీ సాధించిన తెలంగాణను చూడకుండానే కన్నుమూయడం బాధాకరమని అన్నారు. జుక్కల్ పద్మశాలి సంఘం అధ్యక్షులు దోమల అశోక్ మాట్లాడుతూ పద్మశాలిల్లో ఐక్యత కోసం కృషి చేసిన మహా నాయకులు కొండా లక్ష్మణ్ అని గుర్తు చేశారు. కార్యక్రమం లో పద్మశాలి నాయకులు మెరిగే , మెరిగే దత్తాత్రి, శంకర్,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు