డబ్బుల లొల్లితోనే కొండా సురేఖ బర్తరఫ్
04-09-2026 | 03:30am
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు, నాయకులు ఎక్కడ దొరికితే అక్కడ దోచేస్తున్నారని, ఈ డబ్బుల లొల్లి ఢిల్లీకి చేరి.. కొండా సురేఖను బర్త్ఫ్ చేసే పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja Singh) ఆరోపించారు. కొండా సురేఖ అంశంపై రాజాసింగ్ స్పందించారు.
కొండా సురేఖ ఓఎస్డీ అరెస్టు నుంచి కథ నడిచిందని, అప్పుడే మంత్రి పదవి గుంజుకోవాలని చూశారని తెలిపారు. డబ్బుల వాటాలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, సురేఖను సస్పెండ్ చేయాలని పెద్ద నేతలు ఢిల్లీలో కూర్చున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి జరుగుతోందని, మంత్రులు, పెద్దాచిన్న నేతలు, అధికారులు అనే తేడా లేకుండా అవినీతి నడుస్తోందని ఆరోపించారు..






