ప్రజావాణికి ఆరు దరఖాస్తులు
28-09-2026 | 04:52pm
కోరుట్ల రూరల్, సెప్టెంబర్ 28( విజయ క్రాంతి): మండల ప్రజా పరిషత్ కార్యాలయం(Praja Parishad Office)లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆరు దరఖాస్తులు అందాయి. వీటిలో మూడు రెవెన్యూ శాఖకు, ఒక్కొక్కటి ఉపాధి హామీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలకు సంబంధించినవిగా ఉన్నాయి. ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎంపీడీవో వోదెల రామకృష్ణ కోరారు. దరఖాస్తులపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.